భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు.. 2 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలతో నష్టాలు ఏర్పడ్డాయి. ఇంట్రాడేలో 79,587.15 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచి తర్వాత భారీనష్టాల్లోకి జారుకుని 77,874.59 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 1176.46. నష్టంతో 78,041.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 375.05 పాయింట్ల నష్టంతో 23,576.65 వద్ద స్థిరపడింది.